సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో శ్రీ అమ్మ వారిని నేడు, సోమవారం ఉదయం దర్శించుకొన్న స్థానిక భక్తులు విజయ్ వర్మ ఫణి కుమార్ వర్మ 8 గ్రాములు మరియు శ్రీ రామ వెంకట నరసింహ రావు 4 గ్రాములు బంగారం శ్రీ అమ్మవారికి కానుకగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఇదిలా ఉండగా నిన్న ఉగాది వేడుకలు శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ ఆవరణలో కనివిని ఎరుగని రీతిలో ఘనంగా జరిగాయి. ఉదయం పంచాంగ శ్రవణం, తెలుగు సాంప్రదాయ కార్యక్రమాలతోపాటు గత రాత్రి వరకు జరిగిన పండితుల అష్టావధానం కు విశేషంగా ఆహుతులు విచ్చేసారు. వేలాది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు.
