సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేడు, గురువారం వీరవాసరం మండలంలో పలు గ్రామాల్లో రూ 63 లక్షలతో సిసి రోడ్లను ప్రారంభించారు. వీరవాసరం మండలం దూసనపూడి గ్రామంలో రూ 14 లక్షలతో 173 మీటర్ల సిసి రోడ్డు, రూ 8 లక్షలతో 107 మీటర్ల సిసి రోడ్డు, రూ 5 లక్షలతో 58 మీటర్ల సిసి రోడ్డు, రూ 6 లక్షలతో 53 మీటర్ల సిసి రోడ్డు, మత్స్యపురి పాలెం గ్రామంలో రూ 20 లక్షలతో 730 మీటర్ల సిసి రోడ్డు, రూ 10 లక్షలతో మత్స్యపురి పాలెం నుంచి తుందుర్రు సిసి రోడ్డును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. తమ కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నామని, గత ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను నేడు ఎంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అన్ని గ్రామాల్లోను పట్టణంలోను సిసి రోడ్లను వేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలోస్థానిక ఎంపిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్ లు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, బీజేపీ నేతలు, స్థానిక కూటమి కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.
