సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మవరం పురపాలక సంఘం నందు కాపు,బి సి / ఇ.బి.సి కార్పొరేషన్ ద్వారా ఆయా కులాలకు చెందిన యువత స్వయం ఉపాధి వృతి వ్యాపార నిర్వహణ కోసం 2024-25 సంll నకు గాను వ్యాపారముల నిమిత్తం సబ్సిడీ లోన్స్ కోరుతూ ఓ.బి. యమ్. యమ్.యస్ ద్వారా ఆన్లైన్ చేసుకున్న అర్జీ దారులకు ఇంటర్వ్యూలు జరపి అర్హులైన లబ్ది దారులను ఎంపికచేయు నిమిత్తము ఈ నెల 7, 8, తేదిలలో పురపాలక సంఘ కార్యాలయము నందు ఏర్పాటు చేసిన పట్టిక ప్రకారం ప్రముఖ బ్యాంకుల వారీగా 2 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహింపబడును. సదరు కార్యక్రమమునకు హాజరు కావలసినదిగా మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
