సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అడ్జక్షుడు ట్రంప్ విధించిన సుంకాల దెబ్బతో పశ్చిమ గోదావరి జిల్లా లో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో ప్రక్క అమెరికా పేరు చెప్పి గత 4 రోజులుగా అకస్మాత్తుగా భారీగా రొయ్య ధరలు తగ్గించి, ఎగుమతి వ్యాపారులు సిండికేట్ అయ్యి ఆక్వా రైతుల ను మోసం చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి రొయ్య రైతులను కాపాడాలని, లేకపోతె ఇక రొయ్య సాగు కష్టమేనని గుర్తించాలని రొయ్య రైతుల సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి రుద్రరాజు యువరాజు డిమాండ్ చేశారు. భీమవరం పరిసర ప్రాంతాలలో గణపవరం, నిడమర్రు, ఉండి మండలాల ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి బుధవారం (ఈ నెల 9న) ఉండిలో పంక్షన్ హాలులో భారీ సమావేశం ఏర్పాటు చేశామని ఆక్వా రైతులంతా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. .
