సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా భీమవరం మండల న్యాయ సేవా సంస్ధ ఆధ్వర్యం లో భీమవరం కోర్టుల ప్రాంగణంలో సివిల్ మరియు క్రిమినల్ కేసుల పరిష్కారం నిమిత్తం మే నెల 10వ తేదీన “జాతీయ లోక్ అదాలత్” నిర్వహిస్తున్నామని 3వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గౌరవ M.A. సోమశేఖర్ అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో అన్ని సివిల్ కేసులు, రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులు, చెక్కు బాకీ కేసులు, మనోవర్తి కేసులు, మోటార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు, గృహహింస కేసులు, బ్యాంకు మరియు BSNL మొండి బాకీ కేసులు తదితర కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ రాజీ అంతిమ తీర్పు కాబట్టి అప్పీలు చేసుకునే అవకాశం ఉండదన్నారు. సివిల్ కేసుల్లో రాజీ చేసుకుంటే ఇది వరకే కట్టిన కోర్టు ఫీజు వాపసు వస్తుందన్నారు.. న్యాయవాదులు, పోలీసు అధికారులు రాజీ యొక్క ప్రాముఖ్యతను కక్షిదారులకు తెలియజేసి ఎక్కువ కేసుల రాజీకి ప్రయత్నం చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *