సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 75 ఏళ్ళ వయస్సు వరకు కోటి పైగా మొక్కలు నాటుతూ జీవితాన్ని లోక కల్యాణానికి ఉపయోగించిన తెలుగువాడు, తెలంగాణ వాసి, వన జీవిగా పేరు తెచ్చుకుని కేంద్ర ప్రభుత్వంతో పద్మశ్రీ సత్కారం పొందిన వనజీవి రామయ్య నేడు, శనివారం ఉదయం గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఆయన మరణ వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. వనజీవి రామయ్య మొక్కలు నాటి వాటిని జీవితాంతం రక్షించారు. రామయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ పేర్కొన్నారు రామయ్య తన జీవితాన్ని మొక్కల కోసమే అంకితం చేశారని కొనియాడారు.రామయ్య అవిశ్రాంత కృషి.. ప్రకృతి పట్ల ప్రేమ, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను తెలియజేస్తుందన్నారు.
