సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఎడాపెడా సుంకాల బాదుడు తో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లను అతలాకుతలం చేసిన అమెరికా అద్జ్యక్షుడు ట్రాంప్ తన నిర్ణయాలకు సొంత దేశంలోనే ప్రజలు ప్రతిఘటించడంతో తప్పులు సరిచేసుకోనిపనిలో పడ్డారు. చైనా మినహా మిగతా దేశాలకు సుంకాలలో 3 నెలలు వరకు పాత విధానాలే అమలులో ఉంటాయని ప్రకటించిన ట్రంప్ తాజాగా మరో గుడ్ న్యూస్ ప్రకటించారు. అమెరికా ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకొనే లాప్ టాప్ మొదలు, స్మార్ట్‌ఫోన్‌లు, సెమీకండక్టర్ వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలపై పరస్పర సుంకాలను మినహాయించినట్లు ప్రకటించింది. ఇప్పటివరకు, ఈ రకమైన ఉత్పత్తులపై అమెరికా ప్రకటించిన 145% సుంకాలు చైనా నుంచి దిగుమతులపై కఠినంగా అమలులో ఉన్నాయి. అయితే, ట్రంప్ పరిపాలన తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం, ఈ వస్తువులపై సుంకాలను మినహాయిస్తూ, వాణిజ్య భాగస్వాములకు కొంతకాలం మంచి అవకాశాలు ఇవ్వనున్నాయి. రేపు సోమవారం నుండి స్టాక్ మార్కెట్ కూడా మరింత పుంజుకోనుంది అని విశ్లేషకుల అంచనా..
