సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భారీగా ధరలు తగ్గి మళ్ళి పెళ్లిళ్ల సీజన్లో అకస్మాత్తుగా రికార్డు స్థాయిలో పెరిగిపోయిన చేరిన బంగారం, వెండి ధరలు నేడు, ఆదివారం (ఏప్రిల్ 13న) బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,670గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,700గా ఉంది. ఈ నేపథ్యంలో పసిడి ధర గత వారం రోజుల్లో రూ.5010 పెరగడం గమనార్హం. ఇదే బంగారం ధరలు ఏప్రిల్ 6న 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.90,660గా ఉండగా, ప్రస్తుతం ఏప్రిల్ 13న రూ.95,670 కలదు. అంటే వారం రోజుల్లో 5 వేల రూపాయలకుపైగా పెరిగిపోయింది. . మరోవైపు ఇదే సమయంలో ఏప్రిల్ 6న వెండి ధరలు హైదరాబాద్, విజయవాడలో రూ. 1,03,000 ఉండగా, ప్రస్తుతం రూ.1,10,000కి చేరుకున్నాయి. అంటే వెండి కూడా బంగారం కంటే ఎక్కువగా 7 వేల రూపాయలుపెరిగింది.
