సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా పదవిని అధిష్టించింది మొదలు గత 10 నెలలుగా రైతుల కోసం పంట కాలువల విషయంలో ప్రజలందరికి మంచి నీటి సౌకర్యాల కల్పన కోసం అడ్డంకులు, ఆక్రమణలు తొలగింపులో తన దైన శైలీ లో దూసుకొని పోతున్నారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్, రఘురామకృష్ణంరాజు.. తాజగా నేడు గురువారం ఉదయం పాలకోడేరు మండలం, పెన్నాడ మేజర్ పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న త్రాగు నీటి సమస్యను స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు స్వయంగా వచ్చి పరిశీలించి ఈ సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అక్కడ అధికారులును ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను రెండు నెలల్లో పరిష్కరించడం జరుగుతుందని. 55 లక్షల నిధులుతో 4 కిలో మీటర్లు మేర ఫైపు లైన్ వేయించి ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షితమైన మంచినీరు అందిస్తామని భరోసా ఇచ్చారు.స్థానిక ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు. అలాగే, కాళ్ళ మండలంలోని మొగదిండి మేజర్ డ్రైన్ పూడిక తీత పనులను పర్యవేక్షించిన రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ చెయ్యని విధంగా నీటి సంఘాల నిరంతర పర్యవేక్షణలో కిక్కిస, గుర్రపు డెక్కలను సమూలంగా కూకటి వేళ్ళతో సహా తీయడం జరుగుతుందని అక్కడి రైతాంగానికి భరోసా ఇచ్చి అనుకున్న సమయానికి త్వరితంగా పూర్తీ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో కొత్తపల్లి నాగరాజు, స్థానిక ప్రజలు , కూటమి నేతలు, రైతులు, పాల్గొన్నారు.
