సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవులు నేపథ్యంలో.. వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో నేటి గురువారం నుండి అంటే ఉచిత ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం అయ్యాయి.( ఫై తాజగా చిత్రంలో) 03-05-25 వరకు 5 నుండి 10 తరగతుల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ మరియు గ్రామర్ ఉచిత శిక్షణా తరగతులను డి యన్ ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు నిర్వహిస్తున్నారు. కళాశాల జాయింట్ సెక్రటరీ కె.రామకృష్ణంరాజు, వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరామరాజు చరవాణి ద్వారా విద్యార్థులకు సందేశం ఇస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో మరియు అంతర్జాతీయంగా రాణించాలంటే ఇంగ్లీష్ భాష అవసరమని అందుచే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాలని అన్నారు. వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజుమాట్లాడుతూ.. తరగతులు 10 రోజుల పాటు ఉదయం 8-30 నుండి 10-30 వరకు జరుగుతాయని భీమవరం పరిసర ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవత అధ్యక్షులు వెంకటపతి రాజు, మానవత సభ్యులు కె.వి.ఎస్. ఎన్. రాజు, ఝాన్సీ లక్ష్మి, గోపాలశర్మ,,,పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్. ఎస్. ఎన్. రాజు, భీమవరం యూనిట్ ప్రధానకార్యదర్శి పి.సీతారామరాజు, వసుధ సభ్యులు పాల్గొన్నారు.
