సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శుక్రవారం మధ్యాహ్నం అమరావతి లో భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ సమక్షంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ,తదితరులు ప్రసంగించారు. …వేదికపై పవన్ కళ్యాణ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇక్కడి రైతుల త్యాగాలు వృధాగా పోవని అమరావతి ఏపీకే కాదు భారత్‌కే తలమానికంగా అవుతుందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో దేశంలోఇబ్బందికర పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కనదుర్గమ్మ ఆశీస్సులతో ప్రధాని మోదీకి బలాన్ని ఇవ్వాలని అందరం ప్రార్థిద్దామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. తదుపరి సభా వేదికపై ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ను పిలచి స్పెషల్ గిఫ్ట్ గా చాకోలెట్ ఇవ్వడం తో చంద్రబాబు తో సహా అందరు నవ్వుకున్నారు. పీఎం. నుండి చాక్లెట్‌ను తీసుకున్న పవన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ రోజు అని అమరావతి నిర్మాణం ఆంధ్రులకు గర్వకారణం అన్నారు. ఈసారి ఎటువంటి అడ్డంకులు లేకుండా కేంద్ర ప్రభుత్వ అండతో శరవేగంతో నిర్మాణాలు పూర్తీ చేస్తామని అన్నారు.ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఏపీలో అమరావతి కి పట్టిన గ్రహణం విడిందని ఇక రాజధాని పనులు శరవేగంగా పూర్తీ అవుతాయని ఏపీ ప్రజలకు అభివృద్ద్ధి కి కేంద్రం సహకారం అన్నివిధాలా అందిస్తామన్నారు.
