సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3 టౌన్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీవెంకట సాయిబాబా వారి 14వ వార్షికోత్సవంలో భాగంగా అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మల్లినీడి తిరుమలరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు సాయిబాబా వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు సాయిబాబా వారికి దర్శించుకుని అన్నాభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు సాయిబాబా వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ సభ్యులు,సాయి భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
