సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం జెపి రోడ్డులో శ్రీపద్మావతి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలోని స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను నేడు, గురువారం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ప్రారంభించారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, చైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, కాకులపాటి వీర రాఘవరావు దంపతులచే స్వామివారిని అమ్మవారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను సంప్రదాయబద్దంగా చేశారు. అనంతరం 108 కలశాలతో కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి, అమ్మవారికి చందన అలంకరణ చేశారు. 10న రాత్రి 7.30 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుందని, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చే స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, ఎమ్మెల్యే అంజిబాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికిభక్తులు కాకులపాటి వీర రాఘవరావు దంపతులు ప్రత్యేకంగా రెండున్నర కిలోల వెండితో తయారు చేయించిన వెండి కిరీటాన్ని స్వామి వారి కల్యాణం రోజున అలంకరణ చేస్తామని ఈవో తెలిపారు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు.
