సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ సైన్యంలో ఉండి సరిహద్దులలో పాకిస్తాన్ ఉన్మాదులతో పోరాడుతున్న ఆంధ్ర ప్రదేశ్. శ్రీసత్య సాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూ కశ్మీర్లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన ‘రియల్ హీరో‘ మురళీనాయక్ జమ్మూ కాశ్మిర్ లో పాక్ చొరబాటు దారులను అడ్డు కోవడంలో తన టీమ్ తో కల్సి 7గురిని కాల్చి చంపినప్పటికీ వారి కాల్పులలో బులెట్స్ దిగబడి మృతిచెందినట్లు.. కుటుంబసభ్యులకు నేడు శుక్రవారం ఉదయం సమాచారం అందింది..వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదం నిండిపోయింది.2022లో అగ్ని వీర్ జవానుగా సైన్యం లో చేరిన మురళీనాయక్.. రెండు రోజుల క్రితం వరకు మహారాష్ట్రలోని నాసిక్ లో విధులు నిర్వహించారు.అయితే ఆర్మీ అధికారులు పిలుపు మేరకు కాశ్మిర్ వెళ్లి అక్కడ శత్రువులతో పోరాడుతూ మురళీనాయక్ వీరమరణం పొందారు. దేశ రక్షణ కోసం దేశం గర్వపడేలా వీరోచిత పోరాటం చేసిన ఈ వీరకిశోరం మృతికి సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
