సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ మండలం శివాపురం వద్ద లారీని మినీ లారీ ఢీ కొట్టింది. నేడు,మంగళవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఈ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించి రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం విచారకరం అని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలిపారు.
