సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలో అంతర్వాహిని నదిగా ( ఆసేతు హిమాలయాల నుండి దక్షిణాది వరకు భూమి క్రింద నుండి వేల ఏళ్లుగా ప్రవహిస్తున్న జీవ నది) పురాణాలలో పేర్కొన్న సరస్వతీ పుష్కర పుణ్య స్నానాలు నేడు, గురువారం నుంచి ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. సరస్వతి నదిలోని ఒక పాయ గా భావించే తెలంగాణలోని జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని సరస్వతి నదిలో వేలాదిగా భక్తులు పుణ్య స్నానాలు చేసి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కర స్నానాలు ను నేటి గురువారం నుండి(మే15) నుంచి మే 26వ తేదీ వరకు 12 రోజుల పాటు సరస్వతీ పుష్కరాలు జరుగనున్నాయి. నేటి సాయంత్రం కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు.పుష్కరాల కోసం రూ.35 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
