సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి వేసవిలో తెలుగురాష్ట్రాలలో వరుణుడు కాస్త ముందుగానే కరుణిస్తున్నాడు. గత 10 రోజులుగా అడపాదడపా వరుస వర్షాలతో ప్రజలుప్రచండ ఎండల నుండి కాస్త సేద తీరుతున్నారు. నేటి సోమవారం తెల్లవారు జామునుండి ఉదయం 8 గంటల వరకు భీమవరం కాస్త చెదురుమదురుగా వర్షం పడింది.తరువాత ఎండ ప్రచండం అయ్యింది. నిన్న సాయంత్రం కూడా వర్షాలు పడ్డాయి. అయితే రానున్న ఐదు రోజుల్లో కూడా కోస్తా ఆంధ్ర , గోదావరి జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో ఉరుములు పిడుగులతో.. గంటకు 30 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించారు.
