సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అతి త్వరలో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహా నాడు భారీ స్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం విజయవంతం చెయ్యడానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులను ఉత్తేజపర్చడానికి పలు జిల్లాలో టీడీపీ పార్టీ మినీ మహానాడులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు ను గత ఆదివారం భీమవరం జేపీ రోడ్డు లోని పంక్షన్ హాలులో ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ రాజ్య సభ సభ్యురాలు, తోట సీతారామ లక్ష్మి సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి ఎంతో నమ్మకంతో పట్టం కట్టారని , వారి నమ్మకానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని,4000 చప్పున వృధాప్య పింఛన్, ఉచిత గ్యాస్ సిలెండర్లు తదితర సూపర్ సిక్స్ పధకాల అమలులో ముందడుగు వేస్తున్నారని అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ కి అండగా ఉంటున్న టీడీపీ క్యాడర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలో కడప జరగనున్న మహానాడు కు అందరు తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మెంటే పార్ధసారధి, మాజీ మునిసిపల్ చైర్మెన్ మెరుగని నారాయణమ్మ, మాజీ మునిసిపల్ కౌన్సెలర్స్, మాజీ చైర్మన్ మెంటే గోపి మామిడిశెట్టి ప్రసాద్, మరియు కోళ్ల నాగేశ్వర రావు తదితర నేతలు విశేషంగా పాల్గొన్నారు.
