సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రముఖ హీరో , గురూజీ సహకారంతో తన జీవితాన్ని నాశనం చేసారని గత 10 ఏళ్లుగా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వాపోయే పూనమ్ కౌర్ గురించి తెలియని తెలుగువారు ఉండకపోవచ్చు.. మరి నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) తాజగా మరోసారి సంచలనం రేపుతూ ఇన్ స్టా వేదికగా రెండు పోస్టులు పెట్టింది.. తెలుగు ప్రఖ్యాత సినీ ప్రముఖుడు.. ‘త్రివిక్రమ్ (Trivikram) ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. త్రివిక్రమ్‌ను ఒక పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారు? అంటూ దాగుడుమూతలుతో మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం ముందే చెప్పాను, మళ్లీ చెబుతున్నాను ఝాన్సీగారితో మాట్లాడాను, మీటింగ్ పెడదాం అని చెప్పి హఠాత్తుగా నన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పింది. ఈసారి నేను ఎవరి పేరు చెప్పలేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నాకు ఫిర్యాదు ఉందని స్పష్టంగా చెబుతున్నాను.అంతేకాదు నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ ఝాన్షీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను బయట పెట్టింది. దీంతో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న ఈ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో పూనమ్ కౌర్ సోషల్ మీడియా ద్వారా ఎక్స్‌లో త్రివిక్రమ్‌పై పోస్టులు చేసి ఆయనను విచారించాలంటూ మా అసోషియేషన్‌కు రెండు సందర్భాల్లో ఫిర్యాదు చేసింది. ‘కానీ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నుంచి ఎటువంటి స్పందన రాలేదు. త్రివిక్రమ్‌పై ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ‘మా’ సంఘం ఆయన్ని ప్రశ్నించలేదు. నా జీవితాన్ని నాశనం చేసి.. ఆరోగ్యాన్ని.. ఆనందాన్ని కోల్పోయేలా చేసిన ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు,అని ఆరోపించారు.
