సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వం నుండి నిధులు వచ్చే వరకు వేచి చూడకుండా స్వయం ప్రగతి వైపు ఉండి నియోజకవర్గంలో దాతల సహకారంతో అభివృద్ధి పనులను చేపడుతున్న ఎమ్మెల్యే, అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు ఇటీవల రాష్ట్రంలోనే మొదటిసారిగా ఉండి లో నేరాలు, దొంగతనాలు అరికట్టడానికి నిఘా నేత్రాలు సీసీ కెమెరాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 3 కోట్లతో 71 గ్రామాల్లో వేలాది సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి స్థానిక ప్రజల నుండి దాతల నుండి అనూహ్య స్వాందన వచ్చింది. ఇప్పటికే దాతల నుండి సుమారు రూ.1.2 కోట్లు పండ్ రావడం గమనార్హం. ఉండి నియోజకవర్గంలో ఎన్ని ప్రాంతాలల్లో ఏర్పాటు చేసే కెమెరాలతో కెమెరాలను అనుసంధానం చేస్తూ పెద అమిరంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పోలీస్ స్టేషన్లకు స్థానిక దాతల సహకారంతో 4 జీపులు కూడా ఇప్పటికే అందజెయ్యడం జరిగింది.
