సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో నంది అవార్డుల స్థానంలో ప్రముఖ కళాకారుడు, కవి, ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ 2024అవార్డులను ( Gaddar Film Awards) ను గురువారం అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ప్రకటించారు. ఈ సందర్భంగా భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏ.డీ. ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసారు. తర్వాత ఈ విభాగంలో రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ‘పొట్టేల్’, మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ‘లక్కీభాస్కర్’ సినిమాలు ఉన్నాయని జయసుధ తెలిపారు అలాగే బెస్ట్ డైరెక్టర్-నాగ్ అశ్విన్ (కల్కి)ను, ఉత్తమ నటుడుగా పుష్ప 2 కు గాను అల్లు అర్జున్, ఉత్తమ నటిగా చిన్న కధలు సినిమా కు నివేదిత థామస్ ను ఎంపిక అయినట్లు చెప్పారు. జూన్ 14న ఈ అవార్డుల ప్రదాన వేడుక జరగనుంది. ఎంపిక అయినట్లు చెప్పారు. జూన్ 14న ఈ అవార్డుల ప్రదాన వేడుక కన్నుల పండుగగా జరగనుంది.
