సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో‘ సూపర్ స్టార్ కృష్ణ సూపర్ అవార్డ్స్ – 2025; వేడుక, స్వర్గీయ కృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో గత ఆదివారం రాత్రి ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్, రోడ్ నెం. 2, బంజారా హిల్స్, హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో హీరో కృష్ణ అభిమానిగా 40 ఏళ్ళ పైగా తన ప్రస్థానాన్ని కొనసాగించి, ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేప్పట్టిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ ( 3 సారులు 3వేరువేరు వార్డుల నుండి 3 సార్లుగెలిచారు), ప్రముఖ లాయర్ , రాయప్రోలు శ్రీనివాస్ మరియు పాలకొల్లు కు చెందిన మేడికొండ శ్రీనివాస్ చౌదరి లకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రముఖ సినీ నటుడు, కృష్ణ కు చిన్ననాటి స్నేహితుడు , మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ చేతుల మీదుగా అందించారు. ప్రముఖ అంతర్జాతీయ గజల్ గాయకుడు డా. గజల్ శ్రీనివాస్ చలనచిత్ర రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
