సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత మూడు రోజులుగా గోదావరి జిల్లాల లో వరుణుడికి విశ్రాంతి నిచ్చి మరోసారి భానుడు ప్రచండ రూపం దాల్చాడు. మరల ఎండలు మాడిపోతున్నాయ్. తీవ్రమైన ఉక్కపోబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్. రాయలసీమ కే పరిమితం అయ్యాయి కానీ ఏపీ అంతటా విస్తరించలేదు. అయితే బంగాళాఖాతంలో పశ్చిమదిశ గాలుల్లో వేగం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేటి బుధవారం సాయంత్రం నుండి ఈ నెల 8వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం తట్టుకోలేని వేడి వాతావరణం నెలకొన్న కారణంగా ప్రజలకు కొంత స్వాంతన కలిగే అవకాశం ఉంది.
