సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కింద పేద ఇంటిలో పిల్లలు చదువుకుంటే.. అందరికి వారి తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున( 15వేలు కాదు)ఈ నెల 12న ప్రభుత్వం జామ చేసినట్లు ప్రకటించింది. డబ్బులు అందినవారు సంతోషంగా ఉంటె.. అయితే చాల మంది తమకు డబ్బులు రాలేదని సమీప సచివాలయాల వద్దకు వెళ్లి సంబంధిత అధికా రులను ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం లబ్ధి పొందాలంటే 6నెలల్లో సగటున ఇంటి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించకూడదనే నిబంధన వుంది. చాలా మంది లబ్ధిదారులు విద్యుత్ బిల్లుల వేసవి కారణంగా 300 యూనిట్స్ దాటిసి ఉండటం, ఇంట్లో ఉన్న 2మీటర్లు కు మించి ఉండటం , అలాగే వారి ఇంటి స్థలం ఎక్కువగా ఉండటం తదితర కారణాలు ను అధికారులు వారికీ చెపుతున్నప్పటికీ గతంలో వచ్చింది ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని వారితో వాదనకు దిగుతున్నారు. నిజానికి ఈ విద్యుత్తూ యూనిట్స్, ఇంటి స్థలం 2న్నర సెంట్లు మించకూడదు అన్న నిబంధనలు గత ప్రభుత్వ హయాంలో ఉన్నవే.. అయితే ఈసారి వాటిని కఠినంగా అమలు చెయ్యడంతో నిబంధనలుకు లోబడని లబ్దిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.. కొందరికి సపరేటు రేషన్ కార్డులున్నా,అందరు ఒకే ఇంటిలో కలసి ఉంటున్న నేపథ్యంలో చాలా మంది అర్హులు అనర్హులుగా మిగిలిపోయారు. వారం తా సచివాలయాల వద్దకు, కరెంట్ ఆఫీసుల ముందు క్యూ లు కట్టడంతో అధికారులకు సిబ్బందికి తలప్రాణం తోకకు వస్తుంది.
