సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ మిత్ర దేశాలు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రం అవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్లో ఉన్న 10వేల మంది భారతీయుల తరలింపుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇజ్రాయిల్ దాడులా నేపథ్యంలో విమానాల రాకపోకలు నిషేధించడంతో మొదట ఇరాన్ నుంచి భారత పౌరులను రోడ్డు మార్గం ద్వారా సరిహద్దులు దాటించి అర్మేనియాకి చేరుకొని తదుపరి అక్కడి నుండి విమానల ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు. మొదటి విడతలో భారతీయ విద్యార్థులకు భూ సరిహద్దు దాటడానికి ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇరాన్‌లోని ప్రధాన నగరాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తున్నందున, సరిహద్దులు దాటే భారతీయ వ్యక్తుల పేర్లు, పాస్‌పోర్ట్ నంబర్లు, వాహన వివరాలు, సరిహద్దు వివరాలను ఇరాన్ జనరల్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కు అందించాలని సూచించింది.ఈ తరలింపు ఆపరేషన్‌లో భాగంగా.. ఇప్పటివరకు 600పైగా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు (+98 9128109115, +98 9128109109) ఏర్పాటు చేసింది.
