సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో గత ఏడాదిగా వైసీపీ నేతల అరెస్ట్ ల కోలాహలం కొనసాగుతూనే ఉంది. చాల మంది ఇప్పటికే బెయిల్ లపై బయటకు వచ్చిన సరే.. తిరిగి కొత్త కేసులలోనో లేక పాత కేసులలోనే మరల అరెస్ట్ కు సిద్ధం చేస్తున్నారు. ఆఖరికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని ని కూడా వదలలేదు.. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో వదిలిపెట్టారనుకోండి.. తాజగా లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిన్న రాత్రి బెంగళూర్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసి నేడు, బుధవారం వారం విజయవాడకు తరలించారు సిట్ అధికారులు. ఇది ఇలా ఉండగా నోటి దురుసు నేతగా పేరొందిన మాజీమంత్రి వైసీపీ నేత కొడాలి నానిని కోల్‌కతా ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోల్‌కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు? భావిస్తున్నారు. ఏపీలో నమోదైన కేసులో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. కాగా కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతోముంబయి లో బై పాస్ సర్జరీ తరువాత విశ్రాంతి తీసుకొంటున్న కోడలి నాని కొద్ది రోజుల క్రితం ఒక వివాహ వేడుకలో హాజరైన ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే సమయం లో కొడాలి నాని పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కొడాలి నాని ని అడ్డుకున్నకలకత్తా పోలీసులు.. ఏపీలో పోలీసుల అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో, ఇప్పుడు పోలీసులు ఏం నిర్ణయించబోతున్నారు అనేది అధికారిక సమాచారం అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *