సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆద్వర్యంలో బుధవారం మార్కెట్‌లో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి లో నిండిపోయిన వర్షపు డ్రైన్ నీటిని తొలగించాలని ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో చుట్టు ప్రక్కల ఉన్నటువంటి వ్యాపారులు, కాలినడకన, ద్విచరక్రవాహనాలపై వెళ్లే వారు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్ మాట్లాడతూ.. గత కాలంలో నిర్మించిన ఆర్‌యుబిలు ప్రజలకు ట్రాఫిక్ సమస్యలనుండి సౌకర్యవంతంగా ఉంటున్నాయి. కాని వాటి నిర్వహణలో మునిసిపల్ అధికారులు అలతస్వం వహించడం వల్ల అసౌకర్యంగా సమస్యాత్మకంగా మారుతున్నా యన్నారు. ఆర్.యుబిల్లో రాత్రి,పగలు లైట్లు వేయాలి కాని లైట్లు వెలగడంలేదన్నారు భీమవరం మున్సిపాలిటీకి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడం సమస్యలు ఎక్కడికక్కడే శాస్వతంగా పరిష్కారం కాకుండా ఉంటున్నాయన్నారు. కార్యక్రమం అనంతరం మున్సిపల్ అధికారులకు ఫోన్‌లో సంబాషించగా ఎం.ఇ, ఎ.ఇ గార్లు హుటాహుటిన వచ్చి సమస్యను పరిశీలించారు. మోటారు మరమ్మతులు చేపట్టి నీటిని తొలగించారు. ఇకనుండి వ్యర్ధపు నీటిని లేకుండా చూసే బాధ్యత తమదని హామీఇచ్చారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు జిల్లా నాయకులు ఎం.వైకుంఠరావు, బొక్కా సత్యనారాయణ,చెల్లబోయిన వెంకటేశ్వరరావు, కార్యకర్తలు స్థానిక ప్రజానీకం పాల్గొన్నారు.
