సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో నేడు, సోమవారం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ దశాబ్ది వార్షికోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో .. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. వయో వృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత అని, వయో వృద్ధులంటే చిన్న పిల్లలతో సమానమని, చిన్నపిల్లలను చూసుకున్నట్లే వారిని చేసుకోవాలని, కాపుడుకోవాలని అన్నారు. హైకోర్డ్ రిటైర్డ్ న్యాయమూర్తి ఆకుల శేషసాయి మాట్లాడుతూ .. ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో చాలా మందికి తమ కుటుంబాల్లోని పెద్ద వయసువారిని చూసుకోవడం ఇబ్బందిగా మారుతోందని, ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఉన్నా అది ప్రాక్టికల్‌గా సాధ్యపడకపోవచ్చునని అన్నారు. అయినప్పటికీ పెద్దలు గౌరవంగా బ్రతికేందుకు మనస్సు పెట్టాలి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి, సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ వీకే నాగేశ్వరరావు, బోనం పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు.
