సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలోని పాశమైలారంలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో పేలుడు సంభవించి పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కూలిపోయింది.భారీ పేలుడు సంభవించడంతో ఆ ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ఘోర ప్రమాదంలో 12 మంది కార్మికులు మృతి చెందటం మరో 10 మందికి కి పైగా తీవ్ర గాయాలు కావడం పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి. తమ వారి ఆచూకీ తెలపాలంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. అయితే గాయపడి.. ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *