సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో నేడు, గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను వైసీపీ నేతల బృందం (YSRCP Leaders నేడు, గురువారం కలిసింది. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ( YV Subbareddy) జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం తమను ఆహ్వానించినట్లు తెలిపారు. ఓటర్ లిస్టు , పోలింగ్ సరళి తదితర అంశాలపై చర్చలు జరిగాయన్నారు. ఈసీ తో తాము గత 2024 జరిగిన ఎన్నికల్లో ఏపీలో జరిగిన ఎన్నికలలో ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని.. కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతంలో తేడాలు ఉన్నాయని, ఈవీఎంల ఓట్లకు , వివి ప్యాట్‌లు పోల్చి చూడాలని చెప్పామని అయితే ఈసీ అధికారులు తమకు సహకరించలేదని తెలిపారు.విజయనగరం పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం ఓట్లు, వివి ప్లాట్లు కంపారిజన్ చేయమని కోర్ట్ ఆదేశించిన కూడా వివి ప్యాట్‌ల కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పిందన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారన్నారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేదని… అందుకే పాత బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు.ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగిందని వెల్లడించారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయని.. దీనిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు ఈవీఎంలలో బ్యాటరీల పైన కూడా సందేహాలు ఉన్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *