సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తీ అయ్యేసరికి ఇప్పటికే వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు. (కొందరు కీలక అధికారులు తో కలపి) దాదాపు 90 శాతం మంది ఏదొక కేసులలలో అరెస్ట్ లు కావడం తదుపరి బెయిల్ లపై బయటకు రావడం కూడా జరిగిపోయింది.అయితే వీరిలో సుదీర్ఘ కాలంగా తెలుగు దేశం పార్టీలో అధినేత చంద్రబాబు ప్రోత్సహంతో ఒక వెలుగు వెలిగి తరువాత అప్పటికి అధికారంలో ఉన్న వైసీపీ లో చేరి తన నోటి దురుసు తో సమస్యలు కొనితెచ్చుకున్న, ఇటీవల 11 కేసులలో సుమారు 140 రోజులు పోలీస్ కస్టడీలో ఉండి ఇటీవల అన్ని కేసులలో బెయిల్స్ సాధించి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ ని అనారోగ్యంతో పాటు కష్టాలు వదలటంతో లేదు.. తాజగా అక్రమ మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (vallabhaneni Vamsi ) సుప్రీంకోర్టులో (supreme court ) నేడు గురువారం చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజారు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం అనుమతించింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసు మెరిట్స్‌లోకి, పీటీ వారెంట్లోకి వెళ్లడంలేదని పేర్కొంది.
