సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ జిల్లా రామవరంలో నేడు, శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం ( ITC Fire Accident) జరిగింది. ఆనందపురం మండలం రామవరం ఐటీసీ గోడౌన్లో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఘటన స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
