సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అస్సోసియేసన్స్ సంఘం వారు శ్రీ అమ్మవారికి చీర రవిక, మిఠాయిలు, పండ్లు, గాజులు పసుపు కుంకుమ తో భారీ సారె సమర్పించినారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వారికీ శ్రీ అమ్మవారి ప్రసాదం అందించి అభినందించారు.
