సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ అగ్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్(James Cameron) హైందవ సంప్రదాయం ప్రకారం ‘పంచభూతాలు’ ఫాంటసీ కథలతో తో 5 భాగాలుగా సంస్కృత పదం అవతార్ పేరుతొ 5 సిరీస్ సినిమాలులో ఇప్పటికి 2 భాగాలు రిలీజ్ అయ్యి అఖండ విజయాలు సాధించగా .. తాజగా రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్ “అవతార్ 3: ఫైర్ అండ్ ఆష్” దీనిలో అగ్ని కి సంబందించిన కధ మిళితమై ఉంటుంది. . తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ‘ఈ కొత్త పోస్టర్ ద్వారా “వరంగ్” అనే కొత్త విలన్ పరిచయం చేశారు. ఈ పాత్రను ప్రముఖ నటిగా ఎదుగుతున్న ఊనా చాప్లిన్ పోషించనున్నారు. వరంగ్ – “మంగక్వాన్” అనే తెగకు నాయకురాలు – నావీలు నివసించే అగ్నిపర్వతాల సమీపంలోని ప్రమాదకర ప్రాంతంలో జీవించేది. ఆమె గుణ స్వభావాలు, ఆమె కఠిన నిర్ణయాలు కథలో ఆసక్తికర మలుపులను తీసుకురానున్నాయి అని జేమ్స్ కామెరూన్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరో గుడ్ న్యూస్ ఏమిటంటే “అవతార్: ఫైర్ అండ్ ఆష్” ట్రైలర్‌ను జూలై 25న ప్రదర్శించనున్నారు. ఇక సినిమాను కిస్మస్ కానుకగా డిసెంబర్ 19, 2025 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *