సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా యూఏఈ పెట్టుబడుల లక్ష్యంగా అక్కడి పారిశ్రామిక వేత్తలతో నేడు, బుధవారం విజయవాడలో సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు భారత్- యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతంపై మంత్రి నారా లోకేష్ ఈ సదస్సులో ప్రసంగించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని ప్రస్తుతం ఏ ఐ వైపు ప్రపంచం చూస్తుందని.. ఏఐ మంత్రిని కలిగి ఉన్నా మొదటి దేశం యూఏఈ అని వెల్లడించారు. ఏపీ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుని హ్యాకథాన్లు నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని కొంతమందిలో ఆందోళన ఉందని అయితే ఏ ఐ వల్ల వచ్చే పారిశ్రామిక విప్లవం మరిన్ని ఉద్యోగాలు సృష్టిస్తుందని అన్నారు. ఏఐ మనకు వే ఆఫ్ లైఫ్ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
