సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హిస్టారిక‌ల్, సనాతన హిందూ ధర్మం బ్యాక్ డ్రాప్ లో ఈ నెల 23వ తేదీ రాత్రి నుండి ప్రీమియర్ షో లతో రిలీజ్ అయిన వీరమల్లు ప్రేక్షకులు అభిమానులు అంచనాలు అందుకోలేకపోయింది.అయితే ఎన్న‌డు లేనిది ఈ సినిమా రిలీజ్ కు 4 రోజుల ముందు నుండి ‘పవర్ స్టార్’ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా మీడియా ముందుకు వ‌చ్చి ఓ రేంజ్‌లో ప్ర‌మోష‌న్స్ చేయ‌డం, ప్రీమియర్ షో టికెట్ ధరలు ఏకంగా 700 పైబడి పెంచేసి అమ్మడం తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ కలెక్షన్స్ రాబ‌ట్టింది. అయితే ఏది ఏమైనా సినిమా ఫలితం గురించి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా అని ప్రకటించినప్పటికీ తెలుగు మినహా ఏ బాషలలో ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఇటీవల కొన్ని సన్నివేశాలు తొలగించి మరో కొన్ని సన్నివేశాలు కలిపారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. తాజా వార్త సమాచారం ప్రకారం.. ఇప్పుడీ చిత్రం ఆగ‌ష్టు 21 గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లో స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే అభిమానులను నిరాశపరచకుండా పవన్ కళ్యాణ్ నిఖార్సయిన భారీ అంచనాలతో OG తో వచ్చే సెప్టెంబర్ లో ముందుకు రానున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *