సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీ లిక్కర్ స్కాం లో విచారణలో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన కీలక నేత రాజంపేట MP అయిన మిథున్ రెడ్డి ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినందున నేపథ్యంలో నేడు, బుధవారం ఉదయం భీమవరంలోని వైసీపీ ప్రముఖులు మరియు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు , నరసాపురం మాజీ శాసన సభ్యులు ముదునూరి ప్రసాద రాజు సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి ని పరామర్శించారు. సెంట్రల్ జైలు వద్దకు వచ్చిన వారిలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ , మాజీ MP శ్రీ మార్గాని భరత్ మరియు భీమవరం మండలం MPP పేరిచర్ల నరసింహ రాజు, కోడె యుగంధర్, కట్టా రవి శంకర్, రాజా బాల మస్తానయ్య తదితరులు ఉన్నారు.
