సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో ఇంటర్నెట్ లో అన్ని సమాచారాలతో సోషల్ మీడియా సయిట్స్ తో పాటు వేలాది పోర్న్ సైట్స్ విజృభిస్తున్నాయి. దీనిపై ఇటీవల భారత ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఇటీవల 25 అశ్లీల యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకొంది. 2018లో కూడా భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం 827 పోర్న్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు 2015లో సైతం సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి 850 పోర్న్‌ వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. ఈ లెక్కలు ఎలా ఉన్నా యువత ఈ సైట్ల కు బానిసగా మరి వీటి ప్రభావంతో తమ ఉన్నత భవిషత్తు ను కోల్పోతున్నారు. విశృంఖల పోర్న్ చూడటం వల్ల మనుషుల ఆలోచనాధోరణుల్లో మార్పులువచ్చి సమాజం పెడధోరణి పడుతుంది. అనైతిక సంబంధాలతో క్రైమ్ పెరిపోతుంది. నీలి చిత్రాలను పంపిణీ చేసే పోర్న్ హబ్ అనే సంస్థ సర్వే ప్రకారం– అశ్లీల చిత్రాలు చూసేవారిలో అమెరికా, బ్రిటన్ తరువాత స్థానంలో భారతీయులు ఉన్నారు. దేశంలో పట్టణ ప్రాంతాల్లో 63శాతం మంది చూస్తున్నారు, ఇందులో 75 శాతం మొబైల్స్‌లో చూస్తున్నారు. ఈ మార్కెట్‌ను ఆధారం వాటిని యాప్‌లు, వెబ్‌సైట్ల రూపంలో మన ఫోన్లలోకి డంప్ చేస్తున్నారు. గత శుక్రవారం నిషేధానికి గురైన ఉల్లు యాప్ యజమాని ఆస్తి రూ.100కోట్లు అని అంచనా. అయితే ఆ తరహా వీడియోలు తీయడం, ప్రచారం, పంపిణీ మాత్రం నేరం. సెక్షన్ 292 అశ్లీలం అంటే ఏంటో వివ‌రిస్తుంది. తొలిసారి అయితే మూడేళ్ల జైలు శిక్ష, రెండోసారి అయితే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సెక్ష‌న్ 67ఏ ప్రకారం అశ్లీల కంటెంట్‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో ప‌బ్లిష్ చేయ‌డం, షేర్ చేయ‌డం నేరం. ఈ సెక్ష‌న్ కింద గ‌రిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష‌, రూ.10 ల‌క్ష‌ల వ‌రకు జ‌రిమానా విధిస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *