సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు లో నేడు, మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్న వేళా ఆయనతో పాటు కొద్దీ మంది మాత్రమే ఉండాలని పోలీస్ ఆంక్షలు నేపథ్యంలో ఎప్పటి లానే జగన్ తో వేలాది మంది వైసీపీ అభిమానులు తరలి రావడంతో రోడ్లు కిక్కిరిసి పోవడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడానికి వారిపై లాఠీ ఛార్జ్ చెయ్యడం తాడు ప్రక్కన నిలబడిన వారి కాళ్ళపై లాఠీ లతో కొట్టుకొంటూ వెళ్లడం వైసీపీ నేతల ఆందోళన లతో .. తన చేతిపై పోలీసులు కొట్టారని వేలు పనిచెయ్యడం లేదని, మాజీ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న రెడ్డి రోడ్డుపై బెటాయించడం తో హైటెన్షన్ వాతవరణం నెలకొంది. జగన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదని, ధిక్కరిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని వైసీపీ ముఖ్యనేతలతో పాటు కొందరు నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.చాల మందిని ముందే అదుపులోకి తీసుకొన్నారు. అయినప్పటికీ రోడ్లపై కార్యకర్తలు పెద్ద ఎత్తున వేలాదిగా తరలి రావడం విశేషం. ఇదిలా ఉండగా నెల్లూరు జైలులో పలు కేసుల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో జగన్ ములాకత్ అయ్యారు. . అనంతరం జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న(Ex MLA Prasanna) నివాసానికి చేరుకొని ఆయన తల్లిని ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
