సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి అధికారం లోకి వచ్చాక గత ఏప్రిల్‌లో ఎస్సీ యువత కు స్వయం గా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఏలూరు జిల్లాకు 6,833, పశ్చిమగోదావరి జిల్లాకు 3,181 దరఖాస్తులు వచ్చాయి. దీనితో వాటిని పరిశీలించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,853 యూనిట్ల స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిలో ఏలూరు జిల్లాకు 1,111 పశ్చిమగోదావరి జిల్లాకు 742 యూనిట్లు స్థాపించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఏలూరు జిల్లాకు 46.44 కోట్ల రూపాయల యూనిట్లు స్థాపనకు ఆమోదించారు. అయితే వీటిలో ప్రభుత్వ సబ్సిడీ రూ.18.35కోట్లు, బ్యాంకు రుణాలు రూ.25.77 కోట్లు లబ్ధిదారుని వాటాగా రూ.2.3 కోట్లు ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు 742 యూని ట్లకు రూ.3.9 కోట్లు రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో రూ.12.22 కోట్లు సబ్సిడీ కాగా బ్యాంకు రుణాలు రూ.17.13 కోట్లు లబ్ధిదారుడి వాటాగా రూ.1.55 కోట్లుగా నిర్ణయించారు. ఇంకా ఇంటర్వ్యూలు జరుగుతాయనే సమ యానికి ప్రభుత్వం రుణాలప్రక్రియ నిలుపుదల చేసింది. ఎవరు నిరాశ పడకూడదని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా త్వరలో మళ్లీ ఇంటర్వ్వూలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *