సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి తమ వాహనాలపై కృష్ణ జిల్లా ప్రయాణించే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. కీలకమైన గుడివాడ–ముదినేపల్లి జాతీయ రహదారిలో మల్లాయ పాలెం రైల్వేగేటును మరమ్మతు పనుల కోసం ఈ నెల 8 నుంచి 22 వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు ఆకస్మికంగా ప్రకటించారు. కావున ఈ 15 రోజులు వాహనాల మళ్లింపు ఫై ఆర్టీసీ బస్సు లు ఎలా నడపాలి అని ఇబ్బందులు తలెత్తాయి. దీంతో గుడివాడ నుంచి ముదినేపల్లి మీదుగా భీమవరం ఆపై ప్రాంతాలకు, బంటుమిల్లి మీదుగా నరసాపురం తదితర ప్రాంతా లకు ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను గుడివాడ నుంచి ముదినేపల్లి వరకు వాహనాలను మళ్ళించే ఏర్పాట్లు చేస్తే అక్కడి నుంచి అన్ని రూట్లకు వాహ నాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసారు. అయితే గుడివాడ నుంచి దొండపాడు, మోటూరు మీదుగా ముదినేపల్లి వెళ్లేందుకు, కార్లు, చిన్న వాహనాలను, గుడ్లవల్లేరు మీదుగా బస్సులు, ఇతర పెద్ద వాహనాలను, సిద్దాంతం, చౌటపల్లి మీదుగా కొత్త బైపాస్‌ ద్వారా ముదినేపల్లి రూటుకు వాహనాలను మళ్లించాలన్నది అధికారుల నిర్ణయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *