సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: త్వరలోనే భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు, శ్రావణ శుక్రవారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ని సుమారు 9 లక్షల గాజులతో అలంకరణ చేశారు. వేలాదిగా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. 3 రోజుల పాటు ఈ అలంకరణ ఉంటుంది. గాజుల అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని ఎమ్మెల్యే అంజిబాబు దర్శించుకున్నారు. ఆయన శ్రీ అమ్మవారికి భక్తులు కానుకగా సమర్పించిన సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చుతో తయారు చేయించిన 108 గ్రాముల బంగారు పుష్పాలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ కు అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ .. అమ్మవారి స్వర్ణ వస్త్రానికి దాతలు ముందుకు వస్తున్నారని, ఇంకా సుమారు మరో 25 కేజీల బంగారం కావాల్సి ఉందని, రాష్ట్రంలోనే పేరుగాంచిన మావుళ్ళమ్మ అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని తయారు చేస్తామని అన్నారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ ప్రత్యేక పూజలను నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందించి సత్కరించారు.
