సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పులివెందుల నియోజకవర్గంలో ఒక జడ్పీసీటును బలవంతంగా లాక్కోవడమే కాకుండా ఒంటిమిట్టలో జడ్పీటీసీ సీటును కైవసం (Ys Jagan) చేసుకునేందుకు సీఎం చంద్రబాబు దారుణాలకు పాల్పడ్డారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను మోహరించి ఎన్నికలను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని మండిపడ్డారు. ఈరోజు నిజంగా బ్లాక్ డే అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల అధీనంలో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు, అయితే కాస్త ఓదార్పు గ ఈసీ కూడా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికకు సంబంధించి సుమారు 1000 ఓట్లు ఉన్న కేవలం రెండు కేంద్రాల్లో ఇవాళ రీ పోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతో ఆ కేంద్రాల్లో నేటి సాయంత్రం 5 గంటల వరకు రీ పోలింగ్ కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *