సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క శుభకార్యక్రమాల సీజన్.. మరో ప్రక్క గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులు (Gold) హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు, గురువారం తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలైన హైదరాబాద్ (Hyderabad), విజయవాడ (Vijayawada)లో 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.92,900గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,01,350గా ఉంది. ఇక వెండి ధర (Silver Price) రూ.1000 పెరిగి కిలో రూ.1,26,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
