సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తన ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన.. పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒక్కటే పవన్ కళ్యాణ్ మదిలో మెదులుతూ ఉంటుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, మంగళవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు కేక్ కట్ చేసి మాట్లాడారు. సెప్టెంబర్ 2 అంటే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని, అభిమానులకు పండుగ రోజు అని, పవన్ కళ్యాణ్ అంటే ఆయనను నమ్ముకున్న అభిమానులకు గుండె ధైర్యమని అన్నారు. తదుపరి స్థానిక శ్రీ విష్ణు,SRKR కాలేజీలలో నిర్వహించిన అభిమానుల వేడుకలలో పాల్గొన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లం రమేష్ వాణి దంపతుల ఆధ్వర్యంలో 1000 మంది పేదవారికి బియ్యం బస్తాలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమల లో జనసేన పార్టీ పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు కూటమి నేతలు పాల్గొన్నారు.
