సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల (సెప్టెంబర్ 4, 2025న) విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ జాతీయస్థాయి ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) – 2025 ప్రకారం, బి.వి. రాజు కాలేజ్ (ఆటోనమస్), భీమవరం “కాలేజెస్ (ఆర్ట్స్ & సైన్స్)” విభాగంలో 201–300 జాతీయస్థాయి ర్యాంక్ బ్యాండ్‌లో స్థానం దక్కించుకొంది. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్. ప్రసన్నశ్రీ మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వి. స్వామి కళాశాలకు అభినందనలు తెలిపారు. తమ విశ్వవిద్యాలయ పరిధిలోని రెండు స్వయం ప్రతిపత్తి అనుబంధ కళాశాలలు — బి.వి. రాజు కాలేజ్ (ఆటోనమస్), భీమవరం మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (ఆటోనమస్), రాజమండ్రి — ఈ జాతీయ స్థాయి గుర్తింపు పొందడం విశేషమైన విషయంగా పేర్కొన్నారు. ఈ సందర్భముగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ & కళాశాల మేనేజ్మెంట్ తరఫున కె.వి. విష్ణు రాజు , ఛైర్మన్; ఆర్. రవిచంద్రన్, వైస్ ఛైర్మన్; కె. ఆదిత్య విస్సం గారు, సెక్రటరీ;కె. సాయి సుమంత్ , జాయింట్ సెక్రటరీ; జె. ప్రసాద రాజు, డైరెక్టర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్); డా. పి. శ్రీనివాస రాజు, డైరెక్టర్ (స్టూడెంట్ అఫైర్స్), కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులను ఈ జాతీయ స్థాయి గుర్తింపుకు హృదయపూర్వకంగా అభినందించారు.
