సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు శనివారం భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో మాజీ ఎంపీ, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ ను సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముప్పాళ్ల మాట్లాడుతూ సురవరం ను యువత ఆదర్శంగా తీసుకోవాలని, సుధాకర రెడ్డి కర్నూలులో విద్యార్థి ఉద్యమాలు ప్రారంభించి సీపీఐ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారని ఉద్యోగం అన్న ఇవ్వండి జైల్లో అన్నా పెట్టండని పోరాడారని, ప్రపంచ యువజన సమాఖ్యకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారని ధనిక కుటుంబంలో పుట్టినా పేదల పక్షాన నిలిచిన వామపక్ష యోధుడు సురవరం సుధాకర్రెడ్డి అని, పార్లమెంటు సభ్యుడిగా రెండుసార్లు విజయం సాధించినా నిరాడంబర జీవితం గడిపారని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ కామ్రేడ్ సురవరం మృతి సిపిఐ ఉద్యమాలకు, బడుగు బలహీన వర్గాలకు తీరనిలోటన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి‌.గోపాలన్ మాట్లాడుతూ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 2జీ కుంభకోణాన్ని బయట పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారని, యుపిఎ తో తెగతెంపులు చేసుకున్న సందర్భంలో ప్రజల్లో వాస్తవాలు తెలపడానికి బి.వి.రాఘవులుతో కలిసి ఆయన భీమవరం విచ్చేశారని గుర్తు చేశారు. సిపిఐ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి, ఎంసిపిఐయు జిల్లా నాయకులు జి.రాంబాబు త కలిశెట్టి వెంకట్రావు, చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, సికిలే పుష్పకుమారి పలు ప్రజా సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *