సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొద్దీ కాలంగా భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ( Trump)తన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. చైనా సదస్సులో పుతిన్, జింపింగ్ లతో ప్రధాని మోడీ చెట్టాపట్టాల్ చూసే సరికి మొత్తం తేడా కొట్టేసింది. చివరికి దిగొచ్చాడు.ఇండియా చనిపోయిన ఎకానమీ అంటూ నానా తిట్లు తిట్టి, మరల ఇండియా స్నేహాన్ని కోరుతూ.. మోడీ గొప్ప ప్రధాని అంటూ పోస్ట్ లు పెడుతున్నాడు. దానికి మోడీ కూడా అన్ని మరచిపోయి అమెరికా శాశ్వత మిత్రుడంటూ రిప్లై ఇస్తున్నారు. దీంతో మోదీ స్వాందన సానుకూలంగా ఉండటంతో ట్రంప్ తాజాగా నేడు, బుధవారం తన పోస్టులో కీలక కామెంట్స్ చేశారు. ‘భారత్ – యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు తమ మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురు చూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని త్వరలో శుభవార్త వస్తుంది. ’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ప్రతి గా ప్రధాని మోడీ తన పోస్టును ట్యాగ్ చేస్తూ ట్విటర్ (Twitter) వేదికగా రిప్లయ్ ఇచ్చారు. ‘భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్. మన మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని భావిస్తున్నా. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా, భారత్ లోని బృందాలు కృషి చేస్తున్నాయి. నేను కూడా ట్రంప్ తో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నా. రెండు దేశాల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం అంటూ మోదీ పేర్కొన్నారు. మొత్తానికి అమెరికా భారత్ ఫై పెంచిన టాక్స్ లు ఎత్తివేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తుంది.
