సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కన్నడ సినీ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘కాంతార’ చాప్టర్ 1′ భారీ అంచనాలతో విజయదశమి కానుకగా నేడు, గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి కారణం ‘కాంతారా’ గతంలో పాన్ ఇండియా సినిమా గా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.. మరి ‘కాంతార’ చాప్టర్ 1′ సినిమా కధ విషయానికి వస్తే.. ఇది ‘కాంతార’ ఆగమనానికి ముందు కాలంలో జరిగిన కథ .. శివ, అతని తండ్రి ఎక్కడైతే అడవిలో మాయమైపోతారో అక్కడే ‘కాంతార’ ప్రీక్వెల్ ను రిషబ్ శెట్టి మొదలు పెట్టాడు. ఎనిమిదవ శతాబ్దంలో కదంబుల కాలం నాటి కథగా దీన్ని చూపించారు. ‘కాంతార’ అనేది శివుడు తపస్సు చేసిన ప్రదేశం. భర్త కోసం పార్వతీ దేవి సైతం ఇలకు వచ్చి అక్కడో పూల తోటను ను ఏర్పాటు చేస్తుంది. అయితే అక్కడ ఉన్న దేవుని శిల మీద దుష్టశక్తుల దృష్టి పడుతుంది. ‘కాంతార’ లోని గిరిజనులకు ఓ రోజున పెద్ద పులి కావలి కాస్తున్న చిన్న పసిబిడ్డ దొరుకుతాడు. దేవుడి బిడ్డగా అతన్ని భావించి, బెర్మే (రిషబ్ శెట్టి) అనే పేరు పెట్టి గిరిజనులు అతన్ని పెంచుతారు. బెర్మే పెరిగి పెద్దవాడు అయ్యేపట్టికీ భాంగ్రా యువరాజు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య) కన్ను కాంతారలోని దేవుని శిలపై పడుతుంది. అతనికి బుద్ధి చెప్పి వెనక్కి పంపిన బెర్మే, తన సహచరులతో కలిసి భాంగ్రా ను చూడటానికి వెళతాడు. అక్కడ యువరాణి కనకావతి (రుక్మిణీ వసంత్)తో అతనికి పరిచయం అవుతుంది. భాంగ్రాలో వెట్టి చాకిరి చేస్తున్న తన తోటి గిరిజనులకు విముక్తి కలిగించడం కోసం,బెర్మే సిద్థమౌతాడు. ఆ సందర్భంలో అతనికి భాంగ్రా నుండి ఎలాంటి ఆపద ఎదురైంది?అనేది మిగతా కథ. అయితే ఈ కాంతారా లో రిచ్ నెస్ బాగా పెరిగి భావోద్వేగాలు సన్నివేశాలు మాత్రం మోతాదు పీల్ తగ్గింది. రిషబ్ శెట్టి చక్కగా నటించినప్పటికీ దర్శకుడుగా ‘కాంతార’లోని ఎమోషన్ ను క్యారీ చేయడంలో కాస్త తగ్గాడు . ప్రథమార్థంలో పోల్చితే ద్వితీయార్థం బాగుంది. ఇంట్రవెల్, ప్రీ క్లయిమాక్స్ సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. రిషబ్ శెట్టి పాత్ర ప్రీ క్లయిమాక్స్ లో మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. జయరామ్ పాత్ర పతాక సన్నివేశంలో పీక్స్ కు చేరింది. ఈ సినిమాలో చూసేకొలది చూడాలనిపించే యువరాణి పాత్ర రుక్మిణీ వసంత్ దే! విలన్ గా గుల్షన్ దేవయ్య యువరాజు పాత్రలో డబ్బింగ్ అంతగా సూట్ కాలేదు. అజనీశ్ లోక్ నాథ్ మరోసారి సినిమా కు తన సంగీతం తో బిజియం తో ప్రాణం పోసాడు. వరాహ రూపం సాంగ్ మరోసారి హైలైట్ అయ్యింది. హోంబలే కు రాజీపడని, అపజయం ఎరుగని నిర్మాణ సంస్థగామరోసారి నిరూపించుకోంది
