సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శాంతి, అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీజీ అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా నేడు గురువారం స్థానిక మునిసిపల్ ఆఫీస్ తో పాటు బాంబే స్వీట్స్ సెంటర్ లోని గాంధీజీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ మహాత్ముడు చూపిన బాట ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శమని, గాంధీజీ ఆశయాలు చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమన్నారు జాతిపిత చూపిన బాటను అనుసరించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
